Thu Dec 19 2024 17:41:46 GMT+0000 (Coordinated Universal Time)
Srisailam Project : శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుంది. గతంలో కంటే కొంత వాన నీటి ప్రవాహం తగ్గినా ఇంకా నీరు వచ్చి చేరుతుంది
శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుంది. గతంలో కంటే కొంత వాననీటి ప్రవాహం తగ్గినా ఇంకా నీరు వచ్చి చేరుతుందని అధికారులు చెబుతున్నారు. గత కొంత కాలంగా శ్రీశైలంలో ఎడమ, కుడి వైపు జలవిద్యుత్పత్తి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. శ్రీశైలంలో కొన్ని గేట్లు ఎత్తి దిగువకు నీటిని కూడా విడుదల చేశారు.
ఇదీ పరిస్థితి....
ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో 1,32,281 క్యూసెక్కులగా ఉందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. ఔట్‌ఫ్లో 66,051 క్యూసెక్కులు ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 884 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 210.03 టీఎంసీలుగా ఉంది.
Next Story